సెంట్రల్ యునివర్సిటీలపై 207అడుగుల ఎత్తులో మువ్వన్నెల రెపరెపలు
విద్యార్థుల్లో అడుగంటుతున్న జాతీయతను తట్టిలేపెందుకు ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో 207అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరెలా చేయాలని నిర్ణయించారు. నిన్న సూరజఖండ్ లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని నేతృత్వంలో జరిగిన వీసిల సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీల్లో త్రివర్ణ పతాకం ఎగురుతున్నప్పటికీ వాటితోపాటు 46సెంట్రల్ యూనివర్సిటీల్లో సమాన ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తుండగా ,రాజకీయ పార్టీలు కొన్ని వ్యతిరేకిస్తున్నాయి
No comments:
Post a Comment