ఖమ్మం కోటలో గులాభి గుబాళింపు;సై'కిల్' పంక్చర్
త్వరలో ఖమ్మం లో జరగనున్న పురపాలక ఎన్నికల నేపద్యంలో గులాభి గుబాలింపుకు ప్రణాళిక సిద్దం చేసారు. ఇప్పటికే ఖమ్మం లోని అగ్రనేతలను టిఅర్ఎస్ లోకి లాగిన కెసిఆర్ ఇప్పుడు ఖమ్మం లో పట్టున్న టిడిపి ని ఖాళి చేయాలని వ్యూహరచనలో బాగంగా ఈరోజు,రేపు కెసిఆర్ ఖమ్మం పర్యటనలో పదివేలకు పైగా జిల్లా,మండల స్థాయి నేతలు,కార్యకర్తలను పార్టీలో చేర్చుటకు ఖమ్మం మంత్రి తుమ్మల చక్రం తిప్పుతున్నారు. ఇందులో బాగంగా ఖమ్మం జిల్లా మైనారిటీ నాయకులు,మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్ తో పాటు పెద్ద సంఖ్యలో మైనారిటీ కార్యకర్తలు,అనుచరగణం కారేక్కడానికి సిద్దమయ్యారు. అలాగే టిడిపి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిది పొట్ల నాగేశ్వర్ రావు,టిడిపి జిల్లా పార్టీ కమిటీ నేతలు ,ఎంపిటిసి లు,జెడ్పిటి సి లు ,సర్పంచులు పెద్ద ఎత్తున పార్టీలో చేరి టిడిపి కంచు కోటాగా ఉన్న ఖమ్మం లో టిడిపి ని ఖాళీ చేసి ఖమ్మం కోటా పై గులాబి జెండా ఎగురవేయనున్నారు .
No comments:
Post a Comment