ADD

Saturday, 20 February 2016

టిఆర్ఎస్,టిడిపి జోడెడ్ల మధ్య కాడి లా బిజెపి

టిఆర్ఎస్,టిడిపి జోడెడ్ల మధ్య కాడి లా బిజెపి 

అటు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధినేత చంద్రబాబు ,ఇటు తెలంగాణాలో టిఅరేస్ అధినేత కెసిఆర్,ఈ ఇద్దరు చంద్రుల మధ్య బిజెపి. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో ఆంధ్రలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణాలో మాత్రం ఘోర పరాజయం చవి చూసింది,అటు ఆంధ్ర ,ఇటు తెలంగాణాలో బిజెపి మాత్రం వ్యక్తిగతంగా పుంజుకోలేదు,ఆంధ్రలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా,తెలంగాణాలో టిడిపి తో ఉప ఎన్నికలు,ఏమ్మేల్చి ఎన్నికలు,గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పరాజయాల బాటను వీదలేకపోయింది. దీంతో గత వారం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో బాగంగా తెలంగాణాలో టిఅరేస్ తో పొత్తుకు మోడీ,కెసిఆర్ లు అవగాహన కుదుర్చుకుని వచ్చే మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రివర్గంలోకి టిఅరేస్ చేరితే,రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపి కి చోటు కల్పించడానికి అవగాహన కుదిరింది ,అందులో బాగంగానే మొన్న తెలంగాణా బిజెపి నేతలు ఇకపై టిడిపి తో పొత్తు కుడురదంటు కేంద్రానికి తీర్మానం పంపింది. అటు ఆంధ్రలో టిడిపి తో పొత్తుతో,ఇటు తెలంగాణాలో పొత్తుతో రెండు ప్రభుత్వాలలో బాగస్వామి అయి ,కేంద్రంలో ఈ రెండు పార్టీలకు మంత్రివర్గంలో చోటిచ్చి జోడెడ్ల మధ్య కాడిలా బిజెపి ఎంత సమన్వయం కుడుర్చుకుంటుందో....... 

No comments:

Post a Comment