బ్రాండ్ తెలంగాణా సేంద్రీయ కూరగాయలు
తెలంగాణా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తుంది. పూర్తిగా సేంద్రీయ పద్దతిలో కూరగాయలు పండించడానికి కార్యాచరణ సిద్దం చేసి కూరగాయలతో పాటు,కల్తీ లేని కారం,అల్లం ,పప్పులు అన్ని తెలంగాణా బ్రాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ఔట్లెట్లు ఏర్పాటు చేసి అందించాలని భావిస్తుంది. ఇందుకు కెసిఆర్ చైర్మెన్ గా,పోచారం వైస్ చైర్మెన్ గా 18మంది సభ్యులతో కూడిన ఉద్యానవన కమీషన్ ఏర్పాటు చేయనుంది. 250కోట్ల నిదులతో ఏర్పాటు చేయనున్న ఉద్యానవన కమీషన్ విదివిదానాలు ,కార్యాచరణ రూపొందించే బాద్యత ఆయిల్ ఫెడ్ ఎమ్.డి మురళికి అప్పగించారు. ఈ కమీషన్ ద్వారా పేదలకు,పట్టణ ప్రజలకు రసాయనాలు లేని కూరగాయలు అందించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మహిళల ఆధ్వర్యంలో రిటైల్ ఔట్ లెట్ లు ఏర్పాటు చేయటం వల్ల మహిళలకు ఆర్ధిక స్వావలంబన చేకూరనుంది. ప్రస్తుతం తెలంగాణా ప్రజల అవసరాలకు తగినన్ని కూరగాయలు పండించడం వల్ల పక్క రాష్ట్రాల నుండి కూరగాయల దిగుమతులు తగ్గించడం,కూరగాయల ధరలను అదుపులో ఉంచనున్నారు.
No comments:
Post a Comment