నారాయణఖేడ్ ఉపఎన్నికలో టిఅర్ఎస్ ఘన విజయం;మామకు ప్రేమతో అంకితం ఈ విజయం
నారాయణఖేడ్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా లిఖించిన చరిత్రను తిరగరాస్తూ 14సార్లు ఎన్నికలు జరిగగా 10సార్లు గెలిచినా కాంగ్రెస్ ను కంగుతినిపిస్తూ ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో టిఅర్ఎస్ అభ్యర్థి గెలుపు బాద్యతలు తీసుకున్న కెసిఆర్ మేనల్లుడు మంత్రి తన్నీరు హరీష్ రావు నియోజక వర్గ ప్రజలతో మమేకమవుతూ టిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఘన విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈరోజు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ లో టిఅర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 93,076 ఓట్లు ,కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి 39451 ఓట్లు ,టిడిపి అభ్యర్థి విజయాపాల్ రెడ్డి 14787 ఓట్లు పొందారు. టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 53625 ఓట్ల మెజారిటీ తో ఘన విజయంలో కీలకపాత్ర పోషించి మామ కెసిఆర్ కి పుట్టినరోజు కానుక గా హరిష్ రావు సాదించిన ఈ విజయం 'మామకు ప్రేమతో అంకితం... '
No comments:
Post a Comment