ADD

Thursday, 18 February 2016

ముచ్చెర్ల ఫర్మాసిటీ లో సిప్లా యూనిట్;500కోట్ల పెట్టుబడులకు త్వరలో ఎంవోయు

ముచ్చెర్ల ఫర్మాసిటీ లో సిప్లా యూనిట్;500కోట్ల పెట్టుబడులకు త్వరలో ఎంవోయు 

అంతర్జాతీయ ఔషద విపణిలో ప్రత్యేక స్థానం ఉన్న ఫార్మా దిగ్గజం సిప్లా ముచ్చేర్లలో ఏర్పాటవుతున్న ఫార్మా సిటీలో సిప్లా యూనిట్ ఏర్పాటుకు 500కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. గత మూడు రోజులుగా ముంబైలో జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా 'కార్యక్రమం వేదికగా సిప్లా ప్రతినిధులు తెలంగాణా పరిశ్రమల శాఖ ప్రతినిదులతో చర్చలు జరిపారు. కొద్ది రోజులలో సిప్లా ప్రతినిధులు హైదరాబాద్ వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి అవగాహన ఒప్పదం (ఎంవోయు)కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ముంబై కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిప్లా లో అమితాబ్ కు అనుబందం ఉన్నందున త్వరలో జరగనున్న చర్చల్లో అమితాబ్ పాల్గొననున్నట్లు తెలంగాణా పారిశ్రామిక శాఖ అధికారులు తెలిపారు . 

No comments:

Post a Comment