ప్రణీతకు త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
సినీ నటి ప్రణీత త్రుటిలో పెను ప్రమాదం నుండి బయటపడింది. ఈరోజు ఉదయం ఖమ్మంలోని ఓ షోరూం ప్రారంబోత్సవానికి ముఖ్య అతిదిగా హాజరై కార్యక్రమ అనంతరం హైదరాబాద్ తిరిగివస్తుండగా నల్గొండ జిల్లా మోతె మండల కేంద్ర సమీపంలో ఎదురుగా వస్తున్న టూ వీలర్ ని తప్పించబోయిన ప్రణీత కారు డ్రైవెర్ అదుపుతప్పడంతో ఇన్నోవా వాహనం బోల్తా పడింది. కారు బోల్తాపడటంతో ప్రమాదానికి సమీపంలోని ప్రజలు ప్రమాద స్థలికి వచ్చి అందులో ఉన్న ప్రణీత,ప్రణీత తల్లి,డ్రైవర్ ని బయటకిలాగి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రణీత,తన తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద అనంతరం సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రణీత ట్విట్టర్ ద్వార తన క్షేమ సమాచారం ట్వీట్ ద్వార తెలియజేసారు.
No comments:
Post a Comment