చంద్రబాబు కి షాక్ ఇవ్వనున్న జగన్;వైసిపి లోకి డొక్కా మాణిక్య వరప్రసాద్??
తెలంగాణా లో టిడిపి కుదేలవగా ఆ లోటును ఆంధ్రలో తీర్చుకోవాలని బావించి వైసిపి ఎమ్మెల్యే లను టిడిపిలోకి లాగడానికి ప్రయత్నిస్తుంటే జగన్ కూడా టిడిపి అధినేత చంద్రబాబు కి షాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.రెండు రోజుల క్రితం బాబుపై నిప్పులు చెరుగుతూ టిడిపి ఎమ్మెల్యే లు తమతో టచ్ లో ఉన్నారని ఎన్నికలకు సవాల్ విసిరిన జగన్ మొదటగా 2014ఎన్నికల్లో టిడిపి లో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను వైసిపి లోకి చేర్చుకునేందుకు రంగం సిద్దం చేసారు. ఇంకా టిడిపి లో అసంతృప్తి తో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణాలో కెసిఆర్,చంద్రబాబు,జగన్ ల ఆకర్ష్ ఆట రెండు రాష్ట్రాల ప్రజలకు వినోదాన్ని కలిగిస్తుంది .
No comments:
Post a Comment