ADD

Thursday, 18 February 2016

నా యువ భారత సారదులు,రథసారదుల్లారా....!

నా యువ భారత సారదులు,రథసారదుల్లారా....!

నా యువ భారత సారదులు,రథ సారదుల్లారా....!బావి భారత ప్రగతిరథ చక్రాలైన యువతీ,యువకుల్లారా....!మనమంతా భారతీయులం,భరతమాత ముద్దుబిడ్డలం అని బావించి భారతావనిని ముందుకు నడిపించాల్సిన మనం కులం ,మతం ,ప్రాంతాల పేరుతో విడిపోయి ,ఎవరికి వారే యమునా తీరే అన్న విదంగా వ్యవహరిస్తున్నాం. ఈ దేశం నాకేమిచ్చింది?ఇది నా హక్కు ?అని అంటున్న మనం ప్రజాస్వామ్యం మనకిచ్చిన ఓటుహక్కు,రాజ్యాంగం మనకు సూచించిన విదులు,బాధ్యతలను మాత్రం పక్కనపెట్టాం,సమాజంలో అవినీతి పెరుగుతుంది అంటూ విమర్శించే మనమే ఏదైనా పని ఉండి ప్రభుత్వ కార్యాలయాలకి వెలితే అధికారులకు లంచం ఇచ్చి క్షణాల్లో పనిపూర్తి చేసుకుని అవినీతికి ఆజ్యం పోస్తున్నాం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే మనం ఆ మార్పుని మననుండి ఆశించం ,పైగా మనమే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం,మలమూత్ర విసర్జన ,మద్యపానం వంటి కార్యకలాపాలు కొనసాగిస్తాం ,నిబందనలను నిర్లక్ష్యంతో అతిక్రమిస్తాం. హక్కులు ,రిజర్వేషన్లు,రీయంబర్స్మెంట్లు అడిగే మనం ప్రజాస్వామ్యాన్ని నడిపించే నాయకులను ఎన్నుకోడానికి ఓటు వేయడానికి ముందుకురాము. ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ పడే మనం ప్రభుత్వ పాటశాల లు,కళాశాలల్లో చదవడానికి ఇష్టపడం. భావి భారత భవిత నిర్నేతలం అయిన మనం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ???నా యువ భారత యువతీ యువకుల్లారా మన భారతాన్ని మనమే ముందుండి నడిపిద్దాం. 

No comments:

Post a Comment