వలస కార్మికులకు తెలంగాణా ప్రభుత్వ శుభవార్త;దుబాయ్ లో నాయిని నరసింహారెడ్డి
తెలంగాణా నుంచి గల్ఫ్ బాట పడుతూ ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో అష్ట కష్టాలు పడే వారికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణా ప్రభుత్వం తమవంతు ప్రయత్నాలు చేస్తుంది,ఇందులో బాగంగా తెలంగాణా హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి దుబాయ్ పర్యటనకి వెళ్లాడు. ఈ పర్యటనలో బాగంగా సోనాపూర్ క్యంపులోని తెలంగాణా కార్మికులను నిన్న కలిసారు. తెలంగాణా విదేశీ మానవవనరుల సంస్థ(టామ్ కామ్)ద్వారా విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ దేశాలకు అవసరమైన నైపుణ్యమున్న యువకులకు తెలంగాణా ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించేందుకు గల్ప్ సంస్థలకు ,కార్మికులకు వారదిలా పనిచేయనుంది. ఇకపై గల్ప్ దేశాలకని ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ప్ దేశాల్లో మగ్గిపోకుండా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
No comments:
Post a Comment