గబ్బర్ సింగ్ ని మించనున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సంచలనాలు
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సీక్వెల్ అనగానే అంచనాలు అంబరాన్ని తాకాయి అయితే డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్ 'అంచనాలను మించి సంచలనాలు సృష్టిస్తుందని సినీ వర్గాలు పేర్కొంటున్నారు. పవన్ కి జోడిగా కాజల్ తొలిసారి నటిస్తుండగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ కానుందట,అలాగే సినిమాలో పవన్ పంచులు,డైలాగ్స్ అధిరిపొనున్నాయని సమాచారం. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ టాలీవుడ్ సినిమాల్లోనే హైలైట్ గా నిలవనుందని సర్దార్ సినీవర్గాలు పేర్కొంటున్నారు. దేవిశ్రీ సంగీతం లో 2సాంగ్స్ సూపర్ డూపర్ గా నిలవనున్నాయని సమాచారం. అంచనాలు పెరిగిపోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందే 100కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్స్ చేసినట్లు తెలుస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ శాటిలైట్ రైట్స్ ని 13కోట్లకు కొనడానికి జెమినీ టీవి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment