మంత్రి వర్గంలోకి అఖిలప్రియ???;యువ మహిళా మంత్రిగా అఖిల ప్రియ...!
కర్నూల్ రాజకీయాల్లో,వైసిపి లో కీలకమైన భూమ నాగిరెడ్డి,ఆయన కూతురు అఖిలప్రియ లు టిడిపిలో చేరడంతో వైసిపి ని దెబ్బతీయడంతో పాటు కర్నూల్ లో టిడిపి కి కొండంత బలం పెంచిన భూమ నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియకు రాబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయంగా కనిపిస్తుంది. తొలుత అఖిల ప్రియకు మంత్రి పదవి పై చంద్రబాబు కొంత వెనకడుగు వేసినా నాగిరెడ్డి తో బేటీ అనంతరం యువ మహిళా ఎమ్మెల్యే కావడంతో చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.26ఏళ్ల అఖిల ప్రియ కు చోటివ్వడంతో ఒక యువ మహిళకు మంత్రివర్గం లో చోటిచ్చి వారిపై వచ్చే విమర్శలను బలంగా తిప్పికోట్టవచ్చని నాగిరెడ్డి నచ్చచెప్పినట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment