ADD

Friday, 26 February 2016

వివాదాస్పద వర్మ విజయవాడ టూర్

వివాదాస్పద వర్మ విజయవాడ టూర్ 

వివాదాలతో సహవాసం చేసే వర్మ విజయవాడ టూర్ ని విజయవంతం చేశాడు. గత వారం వంగవీటి రంగా సినిమా కారణంగా కొందరినుండి వర్మాకి బెదిరింపు కాల్స్ రాగ ట్విట్టర్ లో 'నేను విజయవాడ వస్తున్న అక్కడే ఉంటా దమ్ముంటే రండి 'అంటూ సవాల్ విసిరిన వర్మ ఈరోజు వంగవీటి సినిమా నిర్మాత దాసరి కిరణ్ తో కలసి విజయవాడ చేరుకున్నారు. విమానం ద్వారా విజయవాడ చేరుకున్న వర్మకి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలుకగా,రాధ ,దేవినేని నెహ్రు వర్గాలు పోటాపోటీగా ర్యాలీ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోవడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. వివాదాలతో పబ్లిసిటీ సంపాదించే వర్మ ఈరోజు విజయవాడ లో తనకు కావలసినంత పబ్లిసిటీ దక్కించుకున్నారు. మరో రెండు రోజులపాటు విజయవాడ లో వంగవీటి అనుచరులతో చర్చలు జరిపి స్క్రీన్ ప్లే సిద్దం చేయనున్న వర్మ ఇంకా ఏం పబ్లిసిటీ స్టంట్స్ చేయనున్నాడో ??

No comments:

Post a Comment