ADD

Thursday, 11 February 2016

టిడిపి కి మరో షాక్....!కాసేపట్లో టిఅర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

టిడిపి కి మరో షాక్....!కాసేపట్లో టిఅర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 

టిడిపి నుండి టిఅర్ఎస్ లోకి వలసలు క్షణ క్షణానికి ఉత్కంట రేపుతున్నాయి. గంట క్రితం వరకు టిడిపి విస్తృత స్థాయి సమావేశం లో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు ,కార్యకర్తలకు బరోసా కల్పించి సమావేశం ముగించామన్న భావన ముగియకముందే సమావేశంలో పాల్గొని మాట్లాడి ,పార్టీలో పరిస్థితి ఏకరవు పెట్టిన నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టిఅర్ఎస్ పార్టీలో చేరటానికి సిద్దమై సామావేశం నుండి మీడియా కంటపడకుండా హరీష్ రావు,కేటిఅర్ లను కలుసుకుని టిఅర్ఎస్ కండువా కప్పుకుని టిడిపి కి ఊహించని షాక్ ఇచ్చాడు. రాజేందర్ రెడ్డి చేరికతో టిడిపి నుండి గెలిచి టిఅర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ల సంఖ్య 10కి చేరడంతో పార్టీ పిరాయింపులతో సంబంధం లేకుండా అసెంబ్లీ లో టిడిపి ని టిఅర్ఎస్ లో విలీనానికి రంగం సిద్దమైంది. 

No comments:

Post a Comment