ADD

Thursday, 11 February 2016

కొలువుదీరిన గ్రేటర్ మున్సిపల్ కార్యవర్గం;మేయర్ గా రామ్మోహన్;డిప్యూటీ గా పసియుద్దీన్

కొలువుదీరిన గ్రేటర్ మున్సిపల్ కార్యవర్గం;మేయర్ గా రామ్మోహన్;డిప్యూటీ గా పసియుద్దీన్ 

గ్రేటర్ మున్సిపల్ కార్యవర్గం కొలువుదీరింది. ఈరోజు ఉదయం  కొత్తగా ఎన్నికైన మున్సిపల్  కార్పొరేటర్లు ,ఎక్ష్ అపీసియో సభ్యులు,మంత్రులసమావేశమైన అనంతరం కలెక్టర్  రాహుల్ బొజ్జ కార్పోరేటర్ల తో  ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం మేయర్ ,డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. మేయర్ గా చెర్లపల్లి డివిజన్ నుండి ఎన్నికైన బొంతు రామ్మోహన్ ,డిప్యూటీ మేయర్ గా బొరబండ నుండి ఎన్నికైన బాబా పసియుద్దీన్ లను ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ ,డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎంఐఎమ్ కార్పొరేటర్లు సైతం మద్దతు తెలపడం విశేషం . మేయర్,డిప్యూటీ మేయర్ లుగా తొలి నుండి టిఅర్ఎస్ కి పనిచేసిన యువనేతలకు దక్కడంతో  అందరూ హర్షం వ్యక్తం చేసారు . 

No comments:

Post a Comment