పరిశ్రమల శాఖ పట్టంతో కెటిఅర్ కి డబల్ ప్రమోషన్ ???
రెండు రోజుల క్రితం కేటిఅర్ కి పురపాలక ,పట్టనాభివ్రుద్ది శాఖ తో ప్రమోషన్ ఇచ్చిన కెసిఆర్ త్వరలో కేటిఅర్ కి డబల్ ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖ ను కె.టి.అర్ కి అప్పగించి కెటిఆర్ వద్దనున్న పంచాయితి రాజ్ శాఖ జూపల్లికి కేటాయించనున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే ఐటి శాఖ నిర్వహిస్తున్న కేటిఅర్ కి పరిశ్రమల శాఖా కేటాయించడంతో కేటిఅర్ తన వాక్చాతుర్యం ,తన గత కార్పోరేట్ అనుభవాలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురాగాలడని కెసిఆర్ భావిస్తున్నారు. పరిశ్రమల శాఖ ,పురపాలక,పట్టనాభివ్రుద్ది ఈ మూడు శాఖలు పట్టణాలకే పరిమితం కావడంతో సరైన సమన్వయంతో మున్దుకెల్లగలరని కెసిఆర్ అభిప్రాయం. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తరువులు రానున్నట్లు సమాచారం,అయితే ఇప్పటికే పెట్టుబడుల వేటలో గతంలో అమెరికా పర్యటనలో విజయం సాదించిన కేటిఅర్ నిన్న ముంబై పర్యటనలో టాటా గ్రూప్ చైర్మెన్ సైరస్ మిస్త్రీ ,రిలయన్స్ గ్రూప్స్ చైర్మెన్ ముఖేష్ అంబానీ తో సమావేశం అయి తెలంగాణా ప్రభుత్వ కార్యక్రమాలతో బాగస్వాములుగా అవడానికి ఒప్పుకున్నట్లు కేటిఅర్ వెల్లడించారు .
No comments:
Post a Comment