వాల్ మార్ట్ ప్రతినిదులతో కేటిఅర్ బేటీ: త్వరలో కీలక ఎంవోయూలు??
తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులు సాదించడానికి కేటిఅర్ కీలక బేటీ ల పరంపర కొనసాగుతుంది. మొన్న దేశీ కార్పోరేట్ దిగ్గజాలైన టాటా ,రిలయన్స్ అధినేతలతో బేటీ అయిన కేటిఅర్ నిన్న ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ ఉపాధ్యక్షుడు ఎన్రిక్ ఒస్లే తో బేటీ అయిన కేటిఅర్ తెలంగాణాలో మహిళల కోసం వాల్ మార్ట్ తో కలసి కిరాణా దుకాణాలు ఏర్పాటు,కృషి మార్ట్ లు,కూరగాయల సరపరాపై చర్చించారు. ఇందుకు అంగీకరించిన వాల్ మార్ట్ ఉపాధ్యక్షుడు త్వరలోనే ఎం. వో.యూ లు చేసుకున్నారు. రిటైల్ రంగంతో పాటు వైద్య ,నైపుణ్య శిక్షణ రంగంలో కూడా తెలంగాణాలో వాల్ మార్ట్ సేవలు అందిస్తామని ఎన్రిక్ తెలిపారు. ఎన్రిక్ తో బేటీ అనంతరం నార్వే రాయబారి నీల్స్ రాగ్నర్ కామ్ తో బేటీ అయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల ఫండ్ కలిగిన నార్వే తెలంగాణా లో పెట్టుబడులకు సిద్దంగా ఉందని,మర్చి లో ఢిల్లీ లో జరిగే నార్వే సంస్థల బేటీ లో పాల్గొనవల్సిందిగా కేటిఅర్ కి ఆహ్వానించారు
No comments:
Post a Comment