తెరపైకి ఓటుకు నోటు:ఎమ్మెల్యే మాగంటి అరెస్టుకు రంగం సిద్దం??
టిడిపిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న టిఅర్ఎస్ ఇప్పుడు మరోమారు ఓటుకు నోటు కేసును మరలా తెరపైకి తెస్తుంది. ఈరోజు ఓటుకు నోటు కేసులో A4 నిందితుడుగా ఉన్న మత్తయ్యకు ఏసిబి నోటీసులు ఇవ్వగా తాజాగా టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ అరెస్టుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన డబ్బులు మాగంటి గోపీనాథ్ నుండి తీసుకోచారని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన ప్రాథమిక ఆదారాలు సేకరించిన ఏసిబి గోపీనాథ్ ని కస్టడీ లోకి తీసుకోనున్నారని సమాచారం. ఓటుకు నోటు కేసుకు సంబంధించి అనుబంద చార్జిషీట్ నమోదు చేయనున్నారు .
No comments:
Post a Comment