ADD

Wednesday, 10 February 2016

తెలంగాణా లో టిడిపి అవుట్ ???టిఅర్ఎస్ లోకి ఎర్రబెల్లి,ప్రకాష్ గౌడ్

 తెలంగాణా లో టిడిపి అవుట్ ???టిఅర్ఎస్ లోకి ఎర్రబెల్లి,ప్రకాష్ గౌడ్ 


 తెలంగాణాలో టిడిపి భూస్థాపితం కానుంది. నిన్న వివేకానంద గౌడ్ టి.అర్.ఎస్ లో చేరి టిడిపి కి షాక్ ఇవ్వగా,ఈరోజు టిడిపికి డబల్ షాక్ తగిలింది.అసెంబ్లీ లో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టిడిపి ని వీడి టిఅర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. గత కొన్నిరోజులుగా టిడిపి ఎమ్మెల్యే లతో మంతనాలు కొనసాగిస్తున్న మంత్రి హరీష్ రావు ఈరోజు నారాయణఖేడ్ లో కెసిఆర్ ఉప ఎన్నికల ప్రచార సభ అనంతరం హరీష్ రావు ని కెసిఆర్ స్వయంగా తన హేలిక్యాప్టార్ లో హైదరాబాద్ తీసుకురాగా ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లతో చర్చల అనంతరం హరీష్ రావు తో కలసి వచ్చి కెసిఆర్ తో మాట్లాడి టిఅర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. 2,3రోజుల్లో వరంగల్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో కెసిఆర్ పార్టీ కండువా కప్పనున్నారు,ఇదిలా ఉంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టిఅర్ఎస్ లో చేరనున్నట్లు ఎర్రబెల్లి ప్రకటించడం టిడిపి గుండెల్లో గునపాలు దిమ్పినట్లు చేసారు. ఇప్పటికే టిఅర్ఎస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యే ల సఖ్య 9కి చేరడంతో మరో ఎమ్మెల్యే చేరితే పార్టీ పిరాయింపు చట్టం వర్తించకుండా అధికారికంగా టిడిపి ఎమ్మెల్యే లు టిఅర్ఎస్ లో విలీనం అయినట్లు అవుతుంది. 

No comments:

Post a Comment