కేంద్రమంత్రిగా పవన్???;కాపు గొడవతో కేంద్రమంత్రి....!
ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ గొడవ ల పుణ్యమా పవన్ కి జాక్ పాట్ తగిలేలా ఉంది. ఇన్నిరోజులు తన కొడుకు లోకేష్ ను కేంద్రమంత్రిగా చేద్దామనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు రిజర్వేషన్ల కుంపటి రగులు కోవడంతో ఇప్పుడు కాపుల మద్దతు తమ పార్టీకే ఉండాలని కేంద్ర మంత్రి పదవికి కాపు కోటాలో పవన్ పేరుని సూచించినట్టు బిజేపీ వర్గాలు అంటున్నాయి.ఇది వరకు గతంలో దాసరి అనూహ్యంగా కేంద్ర మంత్రి అవ్వగా ,పి.అర్.పి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసి చిరు కేంద్ర మంత్రి అయ్యాడు,ఇప్పుడు ఆ అవకాశం పవన్ తలుపు తట్టింది. చంద్ర బాబు పవన్ పేరు సూచించడంతో 2014ఎన్నికల్లో పవన్ టిడిపి-బిజేపీ కి చేసిన సేవలకు గుర్తుగా మోడీ సైతం సానుకూలంగా ఉండనున్నారు. ఈ విషయం పవన్ కి సన్నిహితుడుగా ఉండే బిజేపీ నేత పవన్ కి తెలియజేసి ఇస్తుంది బిజేపీ కనుక సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. పవన్ అంగీకరిస్తే రాబోయే మంత్రి వర్గ విస్తరణలో పవన్ కి చోటుదక్కడం ఖాయం అంటున్నారు.
No comments:
Post a Comment