టాటా గ్రూప్ చైర్మెన్ మిస్త్రీ తో కేటిఅర్ బేటీ
గత నెలరోజులుగా ఎన్నికల ప్రచార బాద్యతలతో గడిపిన కె.టి.అర్ ఇప్పుడు పెట్టుబడుల వేటలో పడ్డాడు . తెలంగాణా ఐ టి ,పంచాయితి శాఖ మాత్యులు కె.టి.అర్ ఈరోజు ముంబై పర్యటనలో ఉన్నారు. ఇందులో బాగంగా తొలుత టాటా గ్రూప్ చైర్మెన్ సైరస్ మిస్త్రీ తో బేటీ అయ్యారు. ఈ బేటీ లో కె,టి.అర్ తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ,టి హబ్ ,టి.ఎస్ ఐపాస్ వంటి కార్యక్రమాల పై ప్రజెంటేషన్ ఇస్తూ తెలంగాణా లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు తెలుస్తుంది ,ఇప్పటికే టాటా గ్రూప్ సంస్థలు ఆదిబట్లలోని ఏరోస్పేస్ హబ్ లో పెట్టుబడులు పెట్టగా రానున్నరోజుల్లో దిపేన్స్ ,ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్థున్ది. అలాగే టాటా స్పేస్ ఎ.ఐ.జీ టెక్నాలజీ సెంటర్ ను హైదరాబాద్ లో పెట్టడంతో పాటు టాటా క్యాపిటల్ లో బాగంగా టి హబ్ కి ఆర్దికసహకారం అందించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది . తెలంగాణా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాగస్వాములు అవుతామని కె.టి.అర్ తో బేటీ లో మిస్త్రీ పేర్కొన్నట్లు సమాచారం .
No comments:
Post a Comment