టార్గెట్ 20/24;2019:ఈ బడ్జెట్ లో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు 5వెల కోట్లు
గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీ పై ప్రభుత్వం ముసాయిదా సిద్దం చేస్తుంది.ఈ బడ్జెట్ లో గ్రేటర్ పరిదిలో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి సుమారుగా 3 వేల కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి ప్రతిపాదనను సిద్దం చేయాల్సిందిగా అధికారులను కెసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తుంది.గ్రేటర్ ఎన్నికల సందర్బంగా పలు కాలనీల ప్రజలను బస్సుల్లో తెలంగాణా ప్రభుత్వం సికింద్రాబాద్ లోని ఐ.డి.హెచ్ కాలనీలో నిర్మించిన ఇళ్ళను చూపడం ఓటర్లకు టి.అర్.ఎస్ పై సానుకూల దృక్పథాన్ని పెంచింది.దీంతో జి.హెచ్.ఎం.సి పరిదిలోని 24 నియోజకవర్గాల పరిదిలో ఐ.డి.హెచ్. కాలనీ తరహాలో లక్ష బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను యుద్ద ప్రాతిపాదికన నిర్మించి అర్హుల వివరాలు సేకరించి 2019 ఎన్నికల్లో జి.హెచ్.ఎం.సి పరిదిలోని 24 నియోజకవర్గాల పరిదిలో సుమారు 20 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యం గా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే మిషన్ బగీరథ లో బాగంగా నగర శివార్లకు యుద్దప్రతిపాదికన గోదావరి జలాలను తరలించడం జరిగింది.2019 వరకు ఇంటింటికి తాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది.అదేవిధంగా మంత్రులందరూ హైదరాబాద్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని,హైదరాబాద్ పరిదిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సైతం విధిగా హాజరుకావాలని కెసిఆర్ సూచించినట్లు తెలుస్తుంది.దీర్ఘకాలిక వ్యూహాలు పన్నడంలో చాణఖ్య చంద్రగుప్తుడుగా పేరుగాంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ 2019 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టి.అర్.ఎస్ వర్గాల సమాచారం.
No comments:
Post a Comment