ఆస్కార్ రెడ్ కార్పెట్ పై అద్బుతం ప్రియాంక అందం
ఆద్యంతం అత్యంత అద్బుతంగా జరిగిన 88వ ఆస్కార్ వేడుకల్లో ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ప్రియాంక చోప్రా తెల్లటి గౌనులో పోనీటైల్ తో ప్రత్యక్షమైన ప్రియాంక దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా ప్రేక్షకుల మదిలో మరిచిపోలేని శిల్పంలా ముద్రించుకుపోయి ప్రేక్షకుల మతి పోగొట్టారు. ఇక హాలీవుడ్ భామలు వినూత్న వస్త్రధారణతో రెడ్ కార్పెట్‌పై హోయలొలికిస్తూ చేసిన క్యాట్‌వాక్‌లు ప్రేక్షకుల మతి పోగొట్టాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్కార్ వేదికను విభిన్నంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌దీప కాంతుల్లో ఆస్కార్ వేదిక మెరిసిపోయింది. తొలిసారి ఆస్కార్ అవార్డు దక్కించుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.
No comments:
Post a Comment