తెలంగాణా లోగిళ్లు....ఎల్ఈడి వెలుగుల్లో....!
తెలంగాణా లోగిళ్ళను ఎల్ఈడి వెలుగులతో నింపేందుకు తెలంగాణా విద్యుత్ శాఖ మాత్యులు జగదీశ్ రెడ్డి ,పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మాత్యుల కేటిఅర్ ,మున్సిపల్ ,డిస్కం అధికారులు సామావేశమై 100రోజుల ప్రణాళిక సిద్దం చేసారు. నిర్దేశించిన 100రోజుల్లో తెలంగాణాలోని 25మున్సిపాలిటీల్లో 6లక్షల గృహాలకు ఇంటికి రెండు ఎల్ఈడి బల్బుల చొప్పున 12లక్షల బల్బులను సరపరా చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఇతర పట్టణాలు గ్రామ పంచాయితీలల్లో ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేయనున్నట్లు కేటిఅర్ తెలిపారు. తెలంగాణాలోని 90లక్షల గృహాలలో 9వాట్ల కోటీ 80లక్షల ఎల్ఈడి బల్బులు అందిస్తే ఇందన పొదుపుతో గృహాలతోపాటు ప్రభుత్వానికి ఎంతో ఆదా అవనుంది.
No comments:
Post a Comment