పాలేరు ఎమ్మెల్యే(పిఎసి చైర్మెన్)రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి
పాలేరు ఎమ్మెల్యే ,ప్రజాపద్దుల కమిటీ చైర్మెన్,మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ కిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. వైఎస్ఆర్ కి నమ్మిన బంటుగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి 5సార్లు ఎమ్మెల్యేగా,వైఎస్,కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాలలో పనిచేసారు,72సంవత్సరాల వెంకట్ రెడ్డి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్స్ పార్టీ కి కీలక నేతగా ఉన్నారు. ఖమ్మం జిల్లా సుజాతనగర్ నియోజకవర్గం నుండి 3సార్లు,పాలేరు నియోజకవర్గం నుండి 2సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా వాణిని కాంగ్రెస్స్ హై కమాండ్ కి బలంగా వినిపించిన రాంరెడ్డి మృతిపట్ల కెసిఆర్ సంతాపం ప్రకటిస్తూ ,తెలంగాణా రాజకీయ నేతల్లో ఎలాంటి మచ్చ లేని నేత అని గుర్తు చేసారు .
No comments:
Post a Comment