తెలంగాణా చంద్రశేఖరుడి తీర్థయాత్రలు???;తెలంగాణా మొక్కులు తీర్చనున్న కెసిఆర్???
తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా రాష్ట్రం సిద్దించాలని మొక్కిన మొక్కులను తీర్చుటకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్ర ,తెలంగాణా దేవాది దేవతలను దర్శించుకునుటకు తీర్థయాత్రలకు సిద్దమైతున్నట్లు సమాచారం. ఇప్పటికే కెసిఆర్ ఆదేశాల మేరకు టిటిడి కోయంబత్తూర్ కి చెందిన ప్రముఖ నగల తయారి సంస్థకు తిరుపతి వేంకటేశ్వర స్వామికి 5కోట్ల విలువైన వజ్ర కిరీటం,5వరసల పసిడి పథకం తయారు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే వరంగల్ బద్రకాళి అమ్మవారికి 57లక్షల విలువైన 2కిలోల బంగారు కిరీటం,వరంగల్ మహబూబాబాద్ కురివి వీరబద్రస్వామికి బంగారు మీసాలు,విజయవాడ కనకదుర్గ కు,పద్మావతి అమ్మవార్లకు తలో 2లక్షల విలువైన ముక్కుపుడకలు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాల మధ్యలో గాని,బడ్జెట్ సమావేశాల అనంతరం గాని తెలంగాణా ముఖ్యమంత్రి ఈ దేవాలయాలను సందర్శించి మొక్కులు తీర్చనున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment