మోగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా
5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించింది ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్,మే రెండు నెలలపాటు అయిదు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్,తమిళనాడు,కేరళ,అస్సాం,పుదుచ్చేరిలో ఆరు దపాలుగా ఎన్నికలను నిర్వహించనుంది. అస్సాంలో ఏప్రిల్ 4,11లలో రెండు దపాలుగా,పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 4,11,17,21,25,30మరియు మే 5న ఆరు దఫాలుగా,తమిళనాడు,పుదుచ్చేరి,కేరళ లో మే 16న ఎన్నికలను నిర్వహించనున్నట్లు,అయిదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మే 19న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్డ్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తొలిసారి నోటాకు గుర్తు కేటాయించనున్నారు. ఈ షెడ్యుల్డ్ కి అనుగుణంగా ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వేలువరచనుంది .
No comments:
Post a Comment