ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిదుల 'ప్రజాదర్బార్'లు
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు,ఎంపి లకు అధికార నివాసాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇందుకు కోటి రూపాయల వ్యయంతో ప్రతి నియోజకవర్గ కేంద్రం లో కోటి రూపాయల వ్యయంతో వాస్తు ప్రకారం తూర్పు ,ఉత్తర దిశలకు అభిముకుఖంగా 2,070చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో మొదటి అంతస్తులో నియోజకవర్గ కార్యాలయం లా ,పై అంతస్తులో నివాస యోగ్యంగా ఆధునిక సదుపాయాలతో భవనం నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నారు,ఇందుకు 2016-17బడ్జెట్ లోనే నిధులు కేటాయించి సంవత్సరం లోగా వీటి నిర్మాణం పూర్తి చేయాలని కెసిఆర్ ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు ,ఎంపి లతో పాటుగా రాజ్యసభ ఎంపి లు,ఎమ్మెల్సీ లకు వారి నియోజకవర్గాల పరిదిలో వీటిని ప్రజాప్రతినిదుల 'ప్రజాదర్బార్'లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
No comments:
Post a Comment