ADD

Friday, 4 March 2016

తెలంగాణకు జాతీయస్థాయిలో మద్దతిచ్చిన తొలి పెద్దాయన ఇక లేరు

తెలంగాణకు జాతీయస్థాయిలో మద్దతిచ్చిన తొలి పెద్దాయన ఇక లేరు 

ఈశాన్య రాష్ట్రాల ఆశాజ్యోతి మాజీ స్పీకర్ పిఎం.సంగ్మా అస్తమయం 


ఈశాన్య రాష్ట్రాల ఆశాజ్యోతి మాజీ లోక్ సభ స్పీకర్ పిఎం సంగ్మా ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. 1988-90ల మధ్య మేఘాలయ ముఖ్యమంత్రి గా పనిచేసిన సంగ్మా 1996-98మధ్య 11వ లోక్ సభ స్పీకర్ గా పనిచేసారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి స్పీకర్ గా పనిచేసిన తొలి వ్యక్తిగా నిలిచిన పెద్దాయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి విశేషంగా కృషి చేసారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సంగ్మా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సఖ్యంగా ఉంటూ వెనుకబడిన ప్రాంతాల వాణిని బలంగా వినిపించిన సంగ్మా తెలంగాణా మలి దశ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన తొలి జాతీయ నేతగా నిలిచారు. సంగ్మా మృతికి ఈరోజు ఉదయం సంతాపం తెలిపిన అనంతరం ఉభయ సభలను వాయిదా వేసారు. సంగ్మా మృతి పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి చెందిన కెసిఆర్ ,సంగ్మా కుటుంబ సభ్యలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 

No comments:

Post a Comment