పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కెసిఆర్ కి ప్రశంసల జల్లు
తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.కెసిఆర్ ప్రజెంటేషన్ ప్రపంచంలోనే ప్రథమం అనుకుంటా,అద్బుతం కెసిఆర్ ప్రజెంటేషన్ అని పారిన్ కరస్పాండెన్స్ క్లబ్ అధ్యక్షుడు కెసిఆర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. భారతదేశం లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి డైనమిక్ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ముఖ్య అతిదిగా ఆహ్వానించడం సంతోష దాయకం. ఈ రకంగా మిమ్మల్ని ప్రపంచ మీడియాకి పరిచయం చేయబోతున్నాం,ఈ సందర్బంగా ఢిల్లీ లో తమ సంస్థ సభ్యులకు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు,సంక్షేమ పథకాలు,తెలంగాణా ప్రభుత్వం తక్కువ సమయంలో సాదించిన విజయాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని సంస్థ అధ్యక్షుడు వెంకట నారాయణ లేఖలో పేర్కొన్నారు,1958లో ఏర్పడిన ఈ సంస్థలో దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రముఖ వార్త పత్రికలు,మీడియా చానళ్లు,మ్యగజిన్లు లకు చెందిన 500మంది ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
No comments:
Post a Comment