స్వర్ణ పతాక వేటలో సంచలన సింధూ సింహ గర్జన
తను ఓ లేడీ శివంగి ....
తను ఆడుతున్న కోర్టులో చూపులు చురకత్తులు ...
తన సింహగర్జన ప్రత్యర్థుల గుండెల్లో గునపాలు ...
డ్రాగన్లను మట్టికరిపిస్తూ ... జపాన్ జింకను వేటాడి ... స్పెయిన్ బుల్ ని ఎదుర్కొని సంచలన స్వర్ణ సింహ గర్జన చేస్తున్న
తానే రియో రోరింగ్ సంచలన సింధూ 120 కోట్ల మంది భారతీయుల ఆశల పల్లకి మోస్తూ ... 120 కోట్ల మంది భారతీయులు కోర్ట్ బయట ఇండియా... ఇండియా ... సిందూ ... సిందూ ... అంటూ సింహ నాదాలు చేస్తుంటే ... కోర్టు లోపల కమాన్... కమాన్ ... అంటూ స్వర్ణ పతాక వేటలో సింహ గర్జన చేస్తూ ... జపాన్ షట్లర్ ఒకుహోరా కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండ రియో ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో 21-19,21-10 తో సంచలన విజయం సాధించి ఫైనల్లో ప్రవెశించింది .
No comments:
Post a Comment