ADD

Friday 12 February 2016

ప్రదాని తో కెసిఆర్ బేటీ

ప్రదాని తో కెసిఆర్ బేటీ 

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో బాగంగా ఈరోజు ప్రదాని మోడీ తో బేటీ అయ్యారు. ఈ బేటీ లో బాగంగా విబజన సమస్యల గురించి చర్చతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా,వచ్చే ఐదేండ్లలో 30571 కోట్ల ప్రత్యేక గ్రాంటు,ఎఫ్అర్ బిఎమ్ పరిది పెంపు,మిషన్ బగీరథ ప్రాజెక్ట్ నిర్వాహణకు 10000కోట్ల ప్రత్యేక గ్రాంటు కేటాయించాలని కోరారు. అలాగే రాబోయే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై చర్చించారు. మోడీ తో బేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో బేటీ అయ్యారు. ఆయనతో బేటీలో రాబోయే 3ఏళ్లలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. 2020 నాటికి తెలంగాణాలో 5000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలిపారు ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. తెలంగాణకు మరిన్ని సౌర పార్కులు కేటాయించాలని కోరారు. ఇందుకు గోయల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది . 

No comments:

Post a Comment