ADD

Monday 8 February 2016

నివురుగప్పిన నిప్పుల నారాయణఖేడ్ ఉపఎన్నిక:అందరిచూపు హరీష్ పైనే


గత నెల రోజులుగా తెలంగాణా ప్రజల చూపంత గ్రేటర్ ఎన్నికలపలితాలవైపు చూసిన,గ్రేటర్ ఎన్నికలతో పాటు నివురుగప్పిన నిప్పుల నారాయణఖేడ్ ఉపఎన్నిక ఉంటూనే ఉంది,దీనికి కారణం బల్దియ ఎన్నికల సారద్యం వహించిన కె.టి.అర్,నారాయణఖేడ్ బాద్యతలు చూస్తున్న హరీష్ రావు లు టి.అర్.ఎస్ పార్టీ కి రెండు కన్నులల ఉండటం.ఇటు కె.టి.అర్ తన బాద్యతలు విజయవంతంగా నిర్వహించి పార్టీ కి ఘన విజయం సాదిన్చిపెట్టడంతో ఇప్పుడు అందరి చూపు నారాయణఖేడ్ పై,ఈ ఎన్నికల బాధ్యతలను నిర్వహిస్తున్న హరీష్ పై  పడింది.ఇప్పుడు హరీష్ రావు దృష్టి అంత నారాయణ్ఖేడ్ లో టి.అర్.ఎస్ కి బారి మెజారిటీ సాదించి ప్రత్యర్థి పార్టీ డిపాజిట్లు గల్లంతు చేయడమే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం అయిన ఇప్పుడు హరీష్ కి సవాల్ గా మారింది,ఇటు బల్దియ ఎన్నికల్లో బోర్లా పడ్డ ప్రతిపక్షాలు ఎలాగైనా కసి తీర్చుకోవాలని పట్టు చూపిస్తే ఈ వారం రోజులు మరో మినీ మహాసంగ్రామం గా నారాయణఖేడ్ ఉపఎన్నిక మారనుంది.కాంగ్రెస్ తరుపున దివంగత సిట్టింగ్ ఎం,ఎల్,ఎ కిష్టారెడ్డి తనయుడు సంజీవ రెడ్డి,టి.అర్.ఎస్ తరుపున భూపాల్ రెడ్డి బరిలో ఉన్న ఈ మినీ మహాసంగ్రామం లో అభ్యర్థులు నామమాత్రమే అయిపోయారు.గత నెలరోజులు నివురుగప్పిన నిప్పుల ఉన్న నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఈ వారం రోజులు మహాసంగ్రామాన్ని తలపిస్తుందేమో...వేచి చూడాల్సిందే  

No comments:

Post a Comment