ADD

Thursday 11 February 2016

విద్యార్ధి నేత నుండి తొలి మేయర్:రామ్మోహన్ ప్రస్థానం

            విద్యార్ధి నేత నుండి తొలి మేయర్:రామ్మోహన్ ప్రస్థానం

వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన రామ్మోహన్ తొలుత ఏబివిపి కార్యకర్తగా పనిచేసి టిఅర్ఎస్ పార్టీ ఏర్పాటయ్యాక టిఅరేస్ విద్యార్థి విబాగం లో చేరి టిఅర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగాడు ఉస్మానియాలో ఎల్ ఎల్ బి పూర్తి చేసిన రామ్మోహన్ ప్రస్తుతం ఉస్మానియాలో పి హెచ్ డి లో థీసిస్ సమర్పించాడు. తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రామ్మోహన్ ఎన్నో సార్లు అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించాడు.ఈ క్రమంలో కెసిఆర్ కి నమ్మినబంటులా మారిన రామ్మోహన్ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో జగన్ వరంగల్ పర్యటన అడ్డుకుని తెలంగాణా డిమాండ్ ని జగన్ కి తెలిసేలా చేసాడు. ఉద్యమంలో బాగంగా ఇతనిపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి.2014ఎన్నికల్లో సనత్ నగర్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి కెసిఆర్ ఆదేశంతో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన రామ్మోహన్ గ్రేటర్ ఎన్నికల్లో చివరి నిమిషంలో కెసిఆర్ ఆదేశాలతో కార్పొరేటర్ గా పోటీ చేసి ఘన విజయం సాదించాడు. తెలంగాణా ఉద్యమంలో బాగంగా చాలారోజులు చర్లపల్లి జైల్లో జైలు జీవితం అనుభవించిన రామ్మోహన్ చర్లపల్లి డివిజన్ నుండి ఎన్నికై తెలంగాణా ఏర్పడ్డాక హైదరాబాద్ తొలి మేయర్ గా ఎన్నికయ్యాడు . 

No comments:

Post a Comment