అమెరికా అగ్ర 'పీఠం' అతివకేనా ???
ప్రపంచ దేశాలు ఆర్ధికమాంద్యం,ఉగ్రవాదం,భూతాపం వంటి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ప్రపంచ దేశాలను శాసిస్తూ,ముందుండి నడిపిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.అమెరికా అద్యక్ష ఎన్నికల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కానప్పటికీ సర్వేలు పలితాలు,ప్రపంచ దేశాల విశ్లేషకులు ఈసారి అమెరికా అద్యక్ష పీఠంపై అతివ అందలం ఎక్కనుందనే భావిస్తున్నారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వాఖ్యలతో తన పార్టీ అభ్యర్థి టెడ్ క్రజ్ కన్నా ముందున్న చివరికి ఎవరు రేసులో మిగులుతారో చెప్పలేమంతున్నారు.ఇక డెమోక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్ కి బెర్ని సాన్దేర్స్ గట్టి పోటీ ఇస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హిల్లెరి అభ్యర్థిత్వానికి సానుకూలంగా ఉండటం హిల్లరీ కె అభ్యర్థిత్వం దక్కనుందని సర్వేలు పేర్కొంటున్నాయి.హిల్లరీ తో అద్యక్ష పదవికి ఎవరు పోటీ పడినా హిల్లరీ అనుభవం,తను ఇదివరకు విదేశాంగ శాక బాద్యతలు నిర్వర్తించిన తీరు,తన చాతుర్యం మొదలగు అంశాలు హిల్లరి నీ అద్యక్ష పీతానికి చేరువచేస్తాయని తెల్సుతుంది.ప్రస్తుతం ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే అగ్రరాజ్య అద్యక్ష పీఠంపై కటువుగా వ్యవహరించే మగమహారాజు కన్నా మహిళా మహారాణి చాకచక్యం మేలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
No comments:
Post a Comment