ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి యూనిట్ @హైదరాబాద్
తెలంగాణా పారిశ్రామిక రంగ కీర్తి కిరీటంలోకి అంతర్జాతీయ వైమానిక రంగ దిగ్గజం ఎయిర్ బస్ చేరబోతుంది. 2500కోట్ల పెట్టుబడులతో సంవత్సరానికి 100న్యావి,100యుటిలిటీ హేలిక్యాప్టర్ల తయారీ సామర్ధ్యంతో 40ఎకరాల విస్తీర్ణంతో 4,500మందికి ఉపాది కల్పన ధ్యేయంగా ఎయిర్ బస్ హేలిక్యాప్టర్ల తయారి యూనిట్ హైదరాబాద్ లో ఏర్పాటుకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో చర్చించింది. ఇందులో బాగంగా తమకు అభివ్రుద్ది చెందిన,పర్యావరణ అనుమతితో కూడిన,పరిశ్రమ స్థలం నుండి విమానాశ్రయానికి రోడ్డు వసతి గల 40ఎకరాల స్థలం కావాలని అడగగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాదర్ గుల్,ఆదిబట్ల ఏరోస్పేస్ పార్కు ఇందుకు అనుకూలంగా ఉంటుందని ఎయిర్ బస్ ప్రతినిదులకు తెలిపింది. రెండు,మూడు రోజుల్లో ఎయిర్ బస్ అధికారుల బృందం స్థల పరిశీలనకు రానుంది.
No comments:
Post a Comment