మామ-అల్లుడి ఇలాకాలో మోగనున్న ఎన్నికల నగార???
కెసిఆర్ రాజకీయ అరంగ్రేటం చేసి అల్లుడు హరీష్ రావు తెరపైకి తెచ్చి కారు కంచుకోటగా ,మామ -అల్లుడి ఇలాకాగా ప్రసిద్ది గాంచిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. సిద్ధిపేట మున్సిపాలిటీలో 6శివారు గ్రామపంచాయితీల విలీనంపై కోర్టులో పిటీషన్ ఉండటంతో గత రెండు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఎన్నికలకు రూట్ క్లియర్ కావడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్తం అవుతుంది. గ్రేటర్ ,నారాయణ్ ఖేడ్ ,వరంగల్ ,ఖమ్మం ఎన్నికల ఘన విజయం తో జోరుమీదున్న టిఅరేస్ కి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల విజయం నల్లేరుమీది నడకే అయినా బారీ స్వీప్ పై కారు కన్నేసింది. సిద్దిపేట ఎన్నికల నోటిఫికేషన్ 19న వెలువరించి ,వచ్చే నెల 3న ఎన్నికల నిర్వహించి ,6న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది .
No comments:
Post a Comment