చిరు-పవన్ ల రాజకీయ చక్రవ్యూహం???
గత ఎన్నికల్లో అన్నదమ్ములు వేరువేరు పార్టీలకు మద్దతుతో ప్రత్యర్థులు గా అవడంతో మెగా అభిమానులు ఎంతో డీలాపడ్డారు. ఎన్నికల అనంతరం తమ్ముడు పవన్ మద్దతిచ్చిన టిడిపి-బిజెపి లు అధికార పీఠం అధిష్టించగా ,అన్న అండగా ఉన్న కాంగ్రెస్ అందపాతాలంలోకి వెళ్ళింది. పవన్ స్థాపించిన జనసేన ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవకున్న తన మిత్ర పార్టీలకు ఓటు బ్యాంకును పెంచాడు.ఎన్నికల అనంతరం టిడిపి ఇచ్చిన హామీలను నెరవెర్చకపొగా కొన్ని విషయాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయంలో పవన్ రానున్న ఎన్నికల్లో మరోసారి క్రియాశీలకం కానున్నాడు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి టిడిపి తో తెగదెంపులు చేసుకుని పార్టీ బలోపెతంపై ద్రుష్టి పెట్టి చిరుని బిజెపి లోకి లాగాలని తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ తెరవెనుక ప్రయత్నాల్లో పవన్ అనుయాయుల పాత్ర ఉందంటున్నారు. 2019ఎన్నికల ముందు చిరుని ఎలాగైనా బిజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దింపి ,పవన్ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో ఉంటె సామాజిక సమీకరణాలు,మెగా అండ,కేంద్ర అధికార బలంతో ఎన్నికల్లో చక్రం తిప్పాలని అన్నదమ్ముల రాజకీయ చక్రవ్యూహం కై అన్నదమ్ముల శ్రేయోభిలాషుల ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment