తెలంగాణా నామినేటెడ్ పదవుల పందేరం???ఆశావాహుల్లో ఎమ్మెల్యేలు???
తెలంగాణాలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల పందేరం త్వరలో ప్రారంబం కానుంది. ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు పెరుగుతుండటంతో మంత్రి వర్గ విస్తరణ ముందే ఆశావాహుల జాబితాను తగ్గించేందుకు రంగం సిద్దం చేసారు. గతంలో పార్లిమెంట్ సెక్రెటరీ పదవులతో కొంతమందిని సంతృప్తి చెందించినా కోర్టు తీర్పుతో అది మూడునాళ్ల ముచ్చటగా మారింది,దీంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల బర్తీ వారంలో చేయనున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమానికి 100కోట్లు కేటాయించిన నేపధ్యంలో బ్రహ్మణ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి దానికి చైర్మెన్ గా హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ ను నియమనించనున్నట్లు తెలుస్తుంది,అలాగే ఆర్టీసీ చైర్మెన్ రేసులో ఎమ్మెల్యే లు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి,విద్యాసాగర్ రావు,జలగం వెంగల్ రావు పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. హౌసింగ్ కార్పోరేషన్ చైర్మెన్ పదవికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ,తెలంగాణా స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మెన్ రేసులో పలువురు ఎమ్మెల్యేల తో పాటు గతంలో టికెట్ ఆశించి బంగపడ్డ నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వారంలో ఈ నాలుగు నామినేటెడ్ పదవులు బర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment