ADD

Saturday, 19 March 2016

భారత్ కు శుభరాత్రి...పాక్ కి కాలరాత్రి...!

భారత్ కు శుభరాత్రి...పాక్ కి కాలరాత్రి...!



భారత్-పాక్ మ్యాచ్ అనగానే మలుపులతో ముచ్చెమటలు పట్టేవి కాని మ్యాచ్ మొదలవకముందే అభిమానులకు వరణుడు ముచ్చెమటలు పట్టించి మునివేళ్ళపై నిలబెట్టగా 8.10నిమిషాలకు టాస్ గెలిచి పాక్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించిన ధోని నిర్ణయాన్ని వమ్ము చేయకుండా పిచ్ టర్న్ ఉపయోగించుకుంటూ భారత్ బౌలర్లు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ని కట్టడి చేసారు. స్లో గా పాక్ బ్యాటింగ్ ని మొదలెట్టగా 38పరుగుల వద్ద రైనా 1/4 సర్జీల్ ఖాన్ 17ని అవుట్ చేయగా భూమ్ర 1/32 అహ్మెద్ శేహజాద్ 25ని పెవిలియన్ కి పంపాడు. నెమ్మదిగా సాగుతున్న పాక్ ఇన్నింగ్స్ ని ఉమర్ అక్మల్ 22,మాలిక్ 26 మెరుపు బ్యాటింగ్ తో పాక్ నిర్ణీత 18 ఓవర్లలో 117పరుగులు చేసింది. 
118పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కి రోహిత్ శర్మ 10పరుగుల వద్ద వెనుదిరగగా సమి ఒకే ఓవర్లో రైనా ,రోహిత్ లను అవుట్ చేసి 23/3 తో భారత్ ని కష్టాల్లో పడేయగా కోహ్లి 37బంతుల్లో 55 సూపర్ బ్యాటింగ్ తో జతకలిసి యువరాజ్ 23బంతుల్లో 24పరుగులు చేసి 61పరుగుల బాగస్వామ్యం నెలకొల్పి భారత ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. కోహ్లి తో కలసి ధోని భారత్ ని విజయతీరాలకు చేర్చాడు. 6వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాదించి వరల్డ్ కప్ లో పాక్ పై విజయాల పరంపర కొనసాగించారు. 

No comments:

Post a Comment