ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాడు ఆ మంత్రిని కొట్టాడట....!
అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు తీరు
నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం సహచర మంత్రులపై ఎలా ఉండేదో ఈరోజు అసెంబ్లీలో బయటపెట్టారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. తెలంగాణాలో కరువు పరిస్థితులపై చర్చ సందర్బంగా జరిగిన చర్చలో 'నాడు నిజాం షుగర్ ప్యాక్టరీ ప్రైవేటీకరణకు ముందు కమిటీ సభ్యులు,అధికారులు,మంత్రులతో చంద్రబాబు సమావేశమైనప్పుడు నేను షుగర్ ప్యాక్టరీని ప్రైవేటీకరణను వద్దని చేతులు ఎత్తి వేడుకుంటూ బతిమాలితే అసహనానికి గురైన చంద్రబాబు నా తొడపై కొట్టారని తోడంత ఎర్రగా కందిపోయింది,సమావేశ అనంతరం చంద్రబాబు తనని మరల పిలిపించుకుని క్షమించమని అంటే మీరు కొట్టిన దెబ్బ నా తొడపై కాదు నా గుండెపై తగిలిందని చంద్రబాబు తో అన్నా నిజాం షుగర్ ప్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపలేదు అలా ఉండేది ఆనాడు ముఖ్యమంత్రి తీరు మంత్రులపై'అని నాటి పరిస్థితులను ,చంద్రబాబు తీరును బయటపెట్టారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి.
No comments:
Post a Comment