తెలంగాణా వ్యాప్తంగా మరిన్ని షీ టీమ్స్
ఈరోజు శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే కొండా సురేఖ షీ టీం ల పనితీరు ,మరిన్ని షీ టీం లను ఏర్పాటు చేయాలని అడిగిన ప్రశ్నకు హోం మంత్రి నాయిని నరశింహ రెడ్డి సమాధానమిస్తూ ప్రస్తుతం తెలంగాణాలోని ప్రతి జిల్లా కేంద్రంలో రెండు షీ టీం లను ఏర్పాటు చేసామని ,షీ టీం ల ద్వారా ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న వారిపై 315కేసులు నమోదు చేసామని ,172మందిని అరెస్టు చేసామని ,ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న 2,400మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని,పదే పదే ఈవ్ టీజింగులకు పాల్పడుతున్న వారిపై నిర్భయ కేసులు పెడుతున్నామని,త్వరలోనే తెలంగాణాలోని ప్రదాన నగరాలు,పట్టణాలలో షీ టీం లను ఏర్పాటు చేస్తున్నామని,కొండా సురేఖ తెలంగాణా వ్యాప్తంగా మహిళా పోలిస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని,ప్రతి స్టేషన్లలో మహిళా డేస్కులను ఏర్పాటు చేయాలని,షీ టీం లలో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలని అడగగా ఇందుకు మంత్రి నాయిని నరశింహ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
No comments:
Post a Comment