తెలంగాణా కీర్తి కిరీటంలోకి మరో హైటెక్ టవర్స్;సైబర్ టవర్స్ ని తలదన్నేలా హైటెక్ టవర్స్
తెలంగాణా ఐటీ పరిశ్రమను మరో మెట్టుకు ఎక్కించాలని ప్రయత్నిస్తున్న సర్కార్ తెలంగాణకే తలమానికంగా నిలిచిన సైబర్ టవర్స్ ని మించిన మరో హైటెక్ సిటీ నిర్మాణానికి తెలంగాణా సర్కార్ సిద్దమైంది ఏప్రిల్ 4న తెలంగాణా ఐటీ విధానాన్ని ప్రకటించనున్న సర్కార్ అందులో హైటెక్ సిటీ నిర్మాణానికి సంబందించిన వివరాలను తెలపనున్నారు. కార్పోరేట్ ప్రాంగణాలకు మిన్నంగా మౌలిక సదుపాయాలతో తెలంగాణాలోని 500చిన్న ఐటీ కంపెనీలకు ఉపయోగపడేలా ఈ టవర్స్ నిర్మించనుంది. అలాగే ప్రస్తుతం మాదాపూర్,గచ్చిబౌలి,నానక్ రామ్ గూడ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నఐటీ పరిశ్రమని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో ఐటీ కారిడార్ విస్తరించనున్నట్లు తెలంగాణా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4న ప్రకటించనున్న ఐటీ పాలసీలో 50లక్షల నుండి 5కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న ఐటీ కంపెనీలకి రాయితీ కల్పించనుంది.
No comments:
Post a Comment