భానుడి భగభగలు... దంచుతున్న ఎండలు...
తెలంగాణా పై భానుడి ప్రతాపం కొనసాగుతుంది,భానుడి భగభగలతో ఎండలు దంచుతుంటే పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ రాబోతున్న మండే ఎండాకాల నెలలపై ఉహాలకు అందని భయాన్ని పెంచుతుంది. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా నిజామాబాద్ 41.1,ఆదిలాబాద్ 40.3,మెదక్ 40,రామగుండం 39.6,వరంగల్ 39.8,నల్గొండ39,బద్రాచలం 38.8,మహబూబ్ నగర్ 38.7,ఖమ్మం 38.2,హైదరాబాద్ 38.5,హాకీంపేట్ 37.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ఉపాధి కూలీలు,విద్యార్థులు,ఉద్యోగులు,ప్రజలు భయటకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
No comments:
Post a Comment