విజయ విరాటపర్వం;సెమీస్ లో భారత్
ఒత్తిడిలో విశ్వరూపం చూపించే విరాట్ కోహ్లి మరోమారు తన సూపర్ బ్యాటింగ్ తో ఇండియా ని సెమిస్ చేర్చాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్లలో 160పరుగులు చేసింది మొదట్లో ఖవాజ 16బంతుల్లో 26,ఫించ్ 34బంతుల్లో 43 పరుగులతో జోరుగా పరుగుల ప్రవాహం కొనసాగించగా ఆసిస్ 200స్కోర్ దాటేలా కనిపించినా పాండ్య 2/36,భూమ్ర 1/32,నెహ్రా 1/20 డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ తో ఆసీస్ ని కట్టడి చేసారు.
161పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట్లో 49పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా కోహ్లి 51బంతుల్లో 82నాటౌట్ సూపర్ షో కి యువరాజ్ 21,ధోని 18నాటౌట్ అండగా నిలవడంతో భారత్ సూపర్ షో తో తొలుత కంగారుపడిన భారత్ చివరకు ఆసీస్ ని కంగారు పెట్టించి మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాదించాడు. ఆసీస్ బౌలర్లో వాట్సన్ 2/23,నైల్ 1/33రాణించారు. 82పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
No comments:
Post a Comment