ADD

Thursday, 31 March 2016

అద్బుతం అద్వితీయం అపర భగీరథుడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్

అద్బుతం అద్వితీయం అపర భగీరథుడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 


ఆరు దశాబ్దాల అన్యాయాన్ని కడిగేస్తూ తెలంగాణా కర్షకుల సాగునీటి కష్టాలను తీర్చేలా కర్షకులకు సాగుపై ఆశను పెంచేలా తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గోదావరి,కృష్ణమ్మ ల నీళ్లను తెలంగాణా బీడు భూములకు మరల్చి తెలంగాణాను సస్యశ్యామల హరిత తెలంగాణాల,అన్నపూర్ణలా మార్చేలా తెలంగాణా ప్రాజెక్టుల రీడిజైన్ సామాన్యులకు సైతం సులభంగా అర్ధం అయ్యేలా సవివరంగా వివరించారు ముఖ్యమంత్రి కెసిఆర్. 
1956నాటికే తెలంగాణాలో సాగునీటి విస్తీర్ణం 20లక్షల ఎకరాలు,అప్పటికే ప్రపంచంలోనే ప్రఖ్యాత మేజర్ సాగునీటి ప్రాజెక్టు నిజాం సాగర్,వాటర్ షెడ్ పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కాకతీయ,రెడ్డి రాజులే అలాంటి పరిస్థితులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణాలో ఈ ఆరు దశాబ్దాల ఆంధ్రా పాలకుల ఆదరణకు నోచుకోక దగాపడ్డ తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల కథ 'రాస్తే రామాయణం-మాట్లాడితే మహాభారతం' అంటూ మొదలెట్టిన కెసిఆర్ ప్రజెంటేషన్ దుమ్ముగూడెం,ప్రాణహిత-చేవెళ్ల,పాలమూరు,తుమ్మిడిహెట్టి ఇలా తెలంగాణాలోని ప్రాజెక్టు ఏదైనా ఆంధ్ర పాలకుల నిరంకుశ దోరనితో ప్రతి ప్రాజెక్టు డిజైన్ తెలంగాణాకి ప్రయోజనం లేకుండా,పక్క రాష్ట్రాలతో జల వివాదాలు వచ్చేలా,పర్యావరణ కొర్రీలు మొదలయ్యేలా చేసిన తీరు సుస్పష్టంగా వివరించిన కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ తో తెలంగాణా లో కోటి ఎకరాలకు సాగునీరు ఎలా ఇవ్వబోతున్నారో వివరించారు. 
ఖమ్మం జిల్లా తో మొదలెట్టిన కెసిఆర్ ఇందిరా,రాజీవ్ సాగర్ కాలువలకు రీడిజైన్ చేసి,దేవాదుల ప్రాజెక్టు ద్వారా కంతనపల్లి ప్రాజెక్టు రిడిజైన్ చేసి స్థలం తుపాకుల గూడెం కొత్తూరు వద్ద ప్రాజెక్టుతో అంతరాష్ట్ర జలవివాదాలు లేకుండా ఖమ్మం జిల్లాలో 6,20000ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పంతో ఉన్నామని,దుమ్ముగూడెం నుండి 60టిఎంసీ నీళ్లు తీసుకుని 19టిఎంసి సామర్ధ్యంతో రోల్లపాడు ప్రాజెక్టుతో వరంగల్ కి 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పాలమూరుకు కల్వకుర్తి ద్వారా వచ్చే సీజన్ నాటికే లక్షా 50వేల ఎకరాల కు సాగునీరు,జోన్నలబోడ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తో పూర్తిస్థాయిలో 3లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తూ ,భీమా ,నెట్టెంపాడు ఎత్తిపోతల ,ఆర్దిఎస్ దిగువ భాగాన్ని తుమ్మల లిఫ్ట్ తో,పాలమూరు ఎత్తి పోతలలో బాగంగా శ్రీశైలం రిజర్వాయర్ -కల్వకుర్తి లిఫ్ట్-ఎల్లూరు లిఫ్ట్-నార్లాపూర్ ప్రాజెక్టు-ఏదుల రిజర్వాయర్-ఎట్టెం రిజర్వాయర్-కరివేర-ఉద్దండాపూర్రిజర్వాయర్-కొండుడుకు లక్షిమిదేవి పల్లి రిజర్వాయర్-అనంతారం రిజర్వాయర్ లతో పాలమూరును సస్యశ్యామలం చేయనున్నామని వివరించారు. నల్గొండ జిల్లాకు ఉదయసముద్రం బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు,దిండి రిజర్వాయర్ తో నిజామాబాద్ నుండి గ్రావిటీతో నల్గొండ లోని మునుగోడు,దేవరకొండ లకు నీల్లిస్తూ,చుటుప్పాల్ వరకు నీటిని తీసుకెళ్ళి 20 టిఎంసి లతో హైదరాబాద్ కి తాగునీటి అవసరాలకు ఒక రిజర్వాయర్ నిర్మించనున్నామని తెలిపారు. 
తెలంగాణా కాశ్మీర్ గా పేరుగాంచిన ఆదిలాబాద్ ని సస్యశ్యామలం చేసేందుకు ఆరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన రోలివాగు,మత్తడివాగు,నీల్వాయి,జగన్నాత్పూర్,కొమురం భీం ప్రాజెక్టులు,సదరం మాటు బ్యారేజీ ద్వార ఆదిలాబాద్ కి సాగునీటి కష్టాలు తీరుస్తామని ,గంగనాల ప్రాజెక్టు ద్వార కోరుట్ల కు,కడెంపై 6.5టిఎంసి సామర్ధ్యంతో కుట్టెం రిజర్వాయర్ తో ఇచ్చోడ,బోథ్ ప్రాంతాలకు సాగునీరు అందించనున్నామని,50ఏళ్ల నిరీక్షణ అయిన లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు కు మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతున్నందున చనఖ-కొరటా బ్యారేజీ ద్వారా 52వేల ఎకరాలకు సాగునీరు,బాసర వద్ద చెక్ డ్యాం,ప్రాణహిత-చేవెళ్ల కి బదులు తుమ్మిదిహెట్టి వద్ద 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి1651 టిఎంసి ల లభ్యత ఉండే కాళేశ్వరం (మేడిగడ్డ)బ్యారేజీ ఇందులో బాగంగా అన్నారం(3.6),చెందుల్ల బ్యారేజీ(5),మేడారం(3)మల్కపేట్(3.5),అనంతగిరి(3.5),హిమామ్ బాద్(0.8),మల్లన్న సాగర్(50)పాముల పర్తి(21),బస్వాపూర్(14),ఆలేరు(10),గుజ్జి(1.5),తల మట్ల (5)తమ్మక్కపల్లి (3),కాచాపూర్ (2.5)కామారెడ్డి(2.5),మంచిప్ప(5),షామీర్ పేట్ 20 టిఎంసి సామర్ధ్యం తో రిజర్వాయర్లతో కరీంనగర్,మెదక్,నిజామాబాద్,రంగారెడ్డి లకు సాగునీరు అందించనున్నామని,రాయపట్నం వంతెన నిర్మాణం అనంతరం ఎల్లంపెల్లి ప్రాజెక్టు పూర్తి అయినందున బ్యాక్ వాటర్ తో ఎల్లంపెల్లి-ధర్మపురి-జైన వరకు నిత్యం నీరు నిల్వ ఉండనుంది,ఎల్లంపెల్లి నుండి నీటిని లిఫ్ట్ తో మిడ్ మానేరు-మల్లన్న సాగర్-సింగూరు-నిజాం సాగర్-ఎస్సారెస్పీ నీటిని లిఫ్ట్ తో నిజామాబాద్,కరీంనగర్,వరంగల్ సస్యశ్యామలం కానుందని ప్రాజెక్టుల రిడిజైన్ తో ఆరు నూరైన ఎవరు అడ్డొచ్చిన కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని ప్రకటించారు.  


No comments:

Post a Comment