కేంద్ర మంత్రులతో మంతనాలు జరుపుతున్న యువరాజు
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యువ మంత్రి కేటిఅర్ నిన్న కేంద్ర మంత్రులతో బిజీ బిజీగా మంతనాలు జరిపారు విబజన చట్టంలోని హామీలు,తెలంగాణాకి అభివృద్ధి నిధులు,మరికొన్ని పనులపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,వెంకయ్య నాయిడు,బీరేంద్ర సింగ్ లతో బేటీ అయ్యారు. తొలుత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బేటీ అయిన కేటిఅర్ తెలంగాణా సర్కార్ జిల్లాలు,మండలాల పునర్వ్యవస్తీకరణ చేపట్టనున్న నేపధ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీ ప్రకారం నియోజకవర్గాల పెంపు త్వరగా చేపట్టాలని,ఐపిఎస్ ,ఐఎఎస్ ల కొరత దృష్ట్యా నియమాకాలు జరిపి తెలంగాణాకి ఐపిఎస్ లను 141కి పెంచాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో సమావేశమైన కేటిఅర్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానం చేయాలని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణాను పరిగణలోకి తీసుకోవాలని కోరిన కేటిఅర్ తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ బగీరథ పనులను పరిశీలించటానికి మంత్రి గారిని ఆహ్వానించారు,అలాగే తెలంగాణకు సంబంధించి 3వేల కోట్ల అభివృద్ధి పనులకు ,172రోడ్డు అనుసందాన వంతేనలకు 500కోట్లు కేటాయించాలని కోరారు.
No comments:
Post a Comment