నా తెలంగాణ అన్నదాతలు అపర భగీరథులు...!రబీలోను 50%పైగా సాగు
తెలంగాణా అన్నదాతలు అపర భగీరథులు గా మారి అనావృష్టి లో సైతం రబీ సీజన్ లో 50%పైగా సాగు చేస్తూ అన్నపూర్ణ ముద్దు బిడ్డలుగా మారారు. రాష్ట్రం మొత్తం మీద రబీ సీజన్ లో 57%సాగు నమోదవగా ఆదిలాబాద్ 90%సాగు నమోదు చేసి అగ్రస్థానం లో నిలువగా,62%తో వరంగల్ రెండో స్థానంలో ,57%తో రంగారెడ్డి మూడో స్థానంలో నిజామాబాద్ ,నల్గొండ 55%,మహబూబ్ నగర్ 53%,ఖమ్మం 53%,కరీంనగర్ 51%సాగు నమోదైంది. కందులు ,శేనగలు,పెసలు 100%కి పైగా సాగు అయి రబీలో కీలక పంటలుగా నిలిచాయి. మొక్కజొన్న 74%,జొన్నలు 70%,గోధుమలు 39%,ముతక ధాన్యాలు71% ,మినుములు 69%,వేరుశనగ 65%,పొద్దుతిరుగుడు 49%,నువ్వులు 29%,మిర్చి 104%,పొగాకు 52%,ఇతర పప్పు దినుసులు 52%సాగు నమోదైందని వ్యవసాయ శాఖ గణాంకాలను వెల్లడించింది.
No comments:
Post a Comment