చిన్న సినిమాలకి కెసిఆర్ పెద్ద ప్రోత్సాహం
తెలంగాణా రాష్ట్రంలో చిన్న సినిమాలకు ప్రోత్సాహకం ఉండేందుకు కెసిఆర్ సర్కార్ వేసిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకనుంచి ప్రతి థియేటర్లలో 5ఆటలు ప్రదర్శించవచ్చని,అందులో ఒక ఆటను చిన్న సినిమాలకు కేటాయించాలని,థియేటర్లు లేని మండల కేంద్రాల్లో 200సీట్ల సామర్ధ్యంతో మినీ థియేటర్లను నియమించాలని ,సినిమా షూటింగులకు దరఖాస్తు చేసుకున్న 48గంటల్లో అనుమతులు ఇవ్వడానికి తీర్మానం చేసింది. తెలంగాణా సినిమాటోగ్రఫి మాత్యులు తలసాని ఆద్వర్యం లో వేసిన మంత్రివర్గ ఉపసంఘం బెటీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలియజేయనున్నారు.
great to hear
ReplyDelete