పోరాటాల తెలంగాణా గడ్డ పెట్టుబడుల ఆకర్షణలో బేష్;కెసిఆర్ సర్కార్ కి మోదీ ప్రశంస
ప్రపంచ అత్యత్తమ ఏక గవాక్ష ఇండస్ట్రియల్ పాలసీ తో పెట్టుబడులను ఆకర్షించడం లో విజయవంతం అవుతున్న తెలంగాణా సర్కార్ ప్రయత్నాన్ని ప్రదాని మోదీ సైతం ముగ్దుడయ్యాడు,ప్రభుత్వ పనితీరుని ప్రశంసల తో ముంచెత్తాడు. నిన్న ప్రగతి కార్యక్రమంలో బాగంగా అన్ని రాష్ట్రాల సిఎస్ లు ,పారిశ్రామిక కార్యదర్శులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఇందులో బాగంగా తెలంగాణా ప్రభుత్వం కేంద్రంతో పెట్టుబడులు,పరిశ్రమల అనుమతులకు సమన్వయంతో ముందుకు వెలుతున్న విధానం,తెలంగాణా ప్రభుత్వ టిఎస్-ఐపాస్ విధానం ,ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ పై సమీక్షించిన ప్రదాని తెలంగాణా ప్రభుత్వాన్ని,ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించారు. ఇందులో పాల్గొన్న సిఎస్ రాజీవ్ శర్మ,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లను ప్రధాని ప్రశంశించారు. గత ఎనిమిది నెలల కాలంలో తెలంగాణా 30000కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ,ప్రపంచ అగ్రశ్రేణి దిగ్గజాలు గూగుల్ ,అమేజాన్ ,ఐకియా ,మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను హైదరాబాద్ రప్పించడం లో విజయవంతం అయ్యారు.
No comments:
Post a Comment